స్కూల్‌లో గంజాయి..కూటమి సర్కార్‌కే సిగ్గుచేటు
తాడేపల్లి: పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన పాఠశాలలో గంజాయి దొరికిన ఘటనపై టీడీపీ కూటమి సర్కార్‌కే సిగ్గుచేటని వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. వంద రోజుల్లో గంజాయిని నిర్మూలం చేస్తామని గొప్పగా చెప్పుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, హోం మంత్రి అనితపై రవిచంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే గంజాయి పై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని మాయ మాటలు చెప్పారు తప్ప చేతల్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. స్కూల్స్ లో కూడా ఇప్పుడు గంజాయి రవాణా జరుగుతుందంటే ఏ స్థాయిలో గంజాయి రవాణా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. ఎన్నో స్కూల్స్ లో యువత మత్తు కి చిత్తు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గోపాల పట్నం హై స్కూల్ విద్యార్థికి గంజాయి ఇస్తున్నారు అని తెలిసి ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. ఏజెన్సీ నుంచి గంజాయి వస్తుంది అని తెలిసి ఏం చేస్తున్నారని నిలదీశారు. విద్యాశాఖ అధికారులు ప్రచారానికి తప్ప.. విద్యార్థుల్లో అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేయడం లేదని తప్పుపట్టారు.