టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి

2 Feb, 2026 15:38 IST

 అనంతపురం : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అరాచక పాలన సాగుతోందని, దీనిని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు గమనించి వెంటనే టీడీపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులను ఖండిస్తూ సోమవారం అనంతపురం నగరంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయంలోని జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ… ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వ హయాంలో బీసీలపై దాడులు పెరిగిపోయాయని, బీసీ నేతలపై జరిగే దాడులను భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామని స్పష్టం చేశారు. దౌర్జన్యాలు, బెదిరింపులతో ప్రజాస్వామ్య గొంతులు నొక్కేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

అనంతరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడికి వయసు పెరిగినా బుద్ధి మాత్రం పెరగలేదని, డైవర్షన్ పాలిటిక్స్‌లో నిపుణుడిగా మారారని విమర్శించారు. ఎస్ఈసీ సభ్యులు మీసాల రంగన్న మాట్లాడుతూ… 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటూ చంద్రబాబు ఈ విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులు చేయించడం విడ్డూరమని అన్నారు. బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు దేవేంద్ర మాట్లాడుతూ… రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనను తక్షణమే ఆపాలని, లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, బీసీ సెల్ నగర అధ్యక్షులు బోయ లక్ష్మన్న, వెన్నపూస రవీంద్రారెడ్డి, చింత సోమశేఖర్ రెడ్డి, సాకే చంద్ర, ఓబిరెడ్డి, రిలాక్స్ నాగరాజు సహా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.