గాలిలో గెలిచిన గాలోడు నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్
చిత్తూరు: నగరి ఎమ్మెల్యే భాను ప్రకాశ్ అరాచకాలు రోజు రోజుకు అధికమవుతున్నాయని, ఆయన గాలిలో గెలిచిన గాలోడు అంటూ వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులతో వేధించడంపై పుత్తూరు కోర్టు వద్ద పోలీసులను మాజీ మంత్రి ఆర్ కే రోజా నిలదీశారు. ఈ సందర్భంగా రోజా ఏమన్నారంటే..`టీడీపీ, జనసేన కూటమి నేతలు దిగజారుడు రాజకీయాలకు తెర లేపారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నవారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఈ తప్పుడు కేసులపై ఎలా పెట్టాలో ఏపీ లో స్టడీ చేయాలి. భాను ప్రకాశ్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. రాజంపేట నుంచి తిరుపతి మీదుగా నగరి కు వచ్చి తమిళనాడుకు టిప్పర్ లు తో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఏడాదిగా పోలీసులు, మైనింగ్ అధికారులు ఏమి చేస్తున్నారు. అరెస్ట్ చేసిన వారిపై వెంటనే బెయిల్ వచ్చింది. ఈ వార్తను సర్క్యూలేట్ చేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై నగరి సి. ఐ వేధింపులకు గురి చేస్తున్నారు. సుప్రీం కోర్టు సోషల్ మీడియా పోస్టులపై అక్రమ అరెస్టులు చేయొద్దని స్పష్టంగా చెప్పినా వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి వేధిస్తున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
కౌన్సిలర్ లు బీడీ భాస్కర్ , బిలాల్ లను అరెస్టు చేసి, తప్పుడు కేసులు పెడుతున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నగరి ఎమ్మెల్యే, జీడి నెల్లూరు నియోజకవర్గం, నగరి లో 13వేల టన్నులు బియ్యం మాఫియాకు పాల్పడ్డారు. టిడిపి నేత అమృత రాజ్ ను అరెస్ట్ చేశారు, వెంటనే అతనికి బెయిల్ ఎలా ఇచ్చారు. ఎమ్మెల్యే కాల్ డేటా తీయండి, అందరిపై కేసులు పెట్టండి` అంటూ రోజా డిమాండ్ చేశారు.