చిన్నరాజప్ప మహిళలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి
28 Jun, 2025 12:36 IST
కాకినాడ: టీడీపీ ఎమ్మెల్యే చిన్నరాజప్ప తన మాటల్ని వెనక్కి తీసుకుని.. మహిళలకి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల డిమాండ్ చేశారు. చిన్న రాజప్ప వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండిస్తూ తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేశారు. ఏపీలో మహిళలకు రక్షణ లేదు సరికదా.. కనీసం గౌరవం కూడా దక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నలుగురికి మంచి చెప్పాల్సిన ప్రజా ప్రతినిధులే మహిళలను అగౌరపరుస్తూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిన్నటికి నిన్న చిన్నరాజప్ప అభివృద్ధి పనుల గురించి మాట్లాడుతూ `వెధవ ముxxడ` అనే పదం వాడారని తప్పుపట్టారు. చిన్నరాజప్ప తన మాటల్ని వెనక్కి తీసుకుని.. మహిళలకి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని శ్యామల డిమాండ్ చేశారు.