కామాక్షి సిద్దేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలి

25 Mar, 2026 14:28 IST

అన్నమయ్య జిల్లా: కలకడ మండలం బాలయగారిపల్లె గ్రామంలోని జరికోన వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ కామాక్షమ్మ, సిద్దేశ్వర స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. బుధవారం నిర్వహించిన పూజా కార్యక్రమాలకు వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు నిర్వాహకులు, ధర్మకర్తలు తిప్పారెడ్డి, కమలాకర్ రెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ఆయన చేత ప్రత్యేక పూజలు నిర్వహింపజేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, కామాక్షమ్మ, సిద్దేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుత శిల్పకళా నైపుణ్యంతో నిర్మించడం అభినందనీయం, ఆదర్శనీయమన్నారు. ఈ దేవాలయం ప్రాంతీయ ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధికి కేంద్రంగా నిలవాలని, దేవతల ఆశీస్సులు ప్రజలందరికీ లభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో  వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు ఆవుల విష్ణు వర్ధన్ రెడ్డి, అఖిల భారత పంచాయతీ పరిషత్ కార్యదర్శి చిదంబర్ రెడ్డి, మండల కన్వీనర్ ఉదయ్ కుమార్ రెడ్డి, లక్కిరెడ్డిపల్లె ఎంపీపీ మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, మండల జేసీఎస్ కన్వీనర్ వడ్డీ వెంకట రమణా రెడ్డి, ట్రైకార్ మాజీ చైర్మన్ గుండా సురేంద్ర, జిల్లా కార్యదర్శి మల్లికార్జున రెడ్డి, చిన్నమండెం బాబు రెడ్డి, రామాపురం వైస్ ఎంపీపీ రవి శంకర్ రెడ్డి, వివి ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ దండు నాగభూషన్ రెడ్డి, ఎంపీటీసీ శ్రీధర్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, సహదేవ, గుట్టపల్లె నరసింహా రెడ్డి, తిక్కం ఆనంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.