అడ్డంగా బుక్కైనా బుకాయించడం బాబు గారి నైజం
1 Sep, 2023 12:43 IST
తాడేపల్లి: అక్రమ ముడుపుల వ్యవహారంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు ఇచ్చింది. ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలపై ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడం పట్ల వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు ముడుపులు మింగేసి, కమీషన్లు కొట్టేశారు చంద్రబాబు గారు. ఐటీ నోటీసులు రాకుండా అడ్డుపడాలనుకున్నా కుదర్లేదు. అడ్డంగా బుక్కైనా బుకాయించడం బాబు గారి నైజం అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.