ద్వారకా తిరుమలలో ఘనంగా వైయస్ఆర్ సీపీ ఆవిర్భావ దినోత్సవం
12 Mar, 2022 16:39 IST
పశ్చిమ గోదావరి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఉభయ గోదావరి జిల్లాల వైయస్ఆర్ సీపీ ఇన్‌చార్జ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరై వైయస్ఆర్ సీపీ జెండాను ఆవిష్కరించారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంక్షేమ పాలన అందిస్తున్న వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి.. పార్టీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా కేక్‌కట్ చేశారు. అనంతరం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేతుల మీదుగా దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లను పంపిణీ చేశారు.