సామాజిక సాధికార యాత్రకు పోటెత్తిన జనం
అనకాపల్లి: అనకాపల్లి నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్రకు జనం పోటెత్తారు. అటు ర్యాలీలో వేలాదిగా పాల్గొన్న జనం, సభాస్థలికి చేరుకోగానే జనసంద్రాన్ని తలపించారు. జై జగన్ నినాదాలతో సభాస్థలి హోరెత్తింది. అత్యంత ఉత్సాహంగా జనం...సభ ఆసాంతం కదలకుండా నిలుచున్నారు. గత ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి ప్రాధాన్యం లేదని.. కానీ, సీఎం వైయస్ జగన్ పాలనలో ఆయా వర్గాలకు పెద్ద పీట వేశారని వైయస్ఆర్‌సీపీ కీలక నేతలు చెబుతున్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా.. గురువారం అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో బహిరంగ సభలో ప్రసంగించారు వాళ్లు.
మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..
వైయస్ఆర్‌సీపీ సామాజిక చైతన్యయాత్ర సభలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మళ్ళీ వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు. దివంగత నేత వైఎస్ పేదల కోసం రెండు అడుగులు ముందుకు వేస్తే.. వైయస్ జగన్ పది అడుగులు ముందుకు వేశారు. టీడీపీ పాలనలో బడుగు బలహీనవర్గాలకు ఎలాంటి గుర్తింపు లేదు. కానీ, సీఎం వైయస్ జగన్ పాలనలో మాత్రం బడుగు బలహీవర్గాలకు పెద్ద పీట వేశారు.
ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. బడుగు బలహీవర్గాలకు సుమారు లక్ష 50 కోట్ల రూపాయల్ని వాళ్ల వాళ్ల ఖాతాల్లో నేరుగా జమ చేసింది ఈ ప్రభుత్వం. సీఎం వైయస్ జగన్ విజనరీ నాయకుడు. సచివాలయం.. వలంటీర్ వ్యవస్థల ద్వారా నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా పేదవాళ్ల జీవితాలకు అండగా నిలిచారు. తండ్రి బాటలోనే పయనిస్తూ పాలన చేస్తున్నారు. ప్రజల హృదయాల్లో సీఎం వైయస్ జగన్ ఉన్నారని తెలిపారు.
సాధికార బస్సు యాత్రలో డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాల నాయుడు, రాజన్న దొర, మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీ సత్యవతి, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బొడ్డిటి ప్రసాద్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ఎమ్మెల్యేలు ధర్మ శ్రీ, అదీప్ రాజు, ఉమా శంకర్ గణేష్ పాల్గొన్నారు.