ప్రజల పక్షాన పోరాడుదాం
పాలకొల్లు: కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల పక్షాన పోరాటం చేద్దామని వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం పాలకొల్లు అడబాల గార్డెన్స్ హాల్ లో పశ్చిమగోదావరి జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైయస్ఆర్‌సీపీ ఉభయగోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ నేతలకు భవిష్యత్ కార్యాచరణ, పార్టీ బలోపేతం, కోటి సంతకాల సేకరణపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు, నరసాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ముదునూరి ప్రసాద్ రాజు, నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు, ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులు & ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణం రాజు, మాజీ మంత్రి, తణుకు నియోజకవర్గ ఇన్చార్జ్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు , తాడేపల్లిగూడెం ఇంచార్జ్ కొట్టు సత్యనారాయణ ,ఆచంట నియోజకవర్గం ఇంచార్జ్, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు ,ఉండి నియోజకవర్గం ఇంచార్జ్ పీవీఎల్ నరసింహ రాజు, భీమవరం నియోజకవర్గం ఇంచార్జ్ చినిమిల్లి వెంకట రాయుడు, పాలకొల్లు నియోజకవర్గం ఇంచార్జ్ గుడాల గోపి,ఎమ్మెల్సీ కావూరు శీను, ఎమ్మెల్సీ వంక రవీంద్ర పార్టీ స్టేట్, జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు