సీఎం వైయస్ జగన్‌ను కలిసిన రాజ్యసభ ఎంపీలు
21 Feb, 2024 18:21 IST
తాడేపల్లి: నూతనంగా రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి కలిశారు. రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి ఎంపీలుగా ఎన్నికైన ధృవపత్రాలు తీసుకుని సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.