పట్టాభి అనుచిత వ్యాఖ్యల‌పై వైయ‌స్ఆర్‌సీపీ నిరసనలు

20 Oct, 2021 11:38 IST


 అమరావతి:   రాష్ట్ర‌వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు ఆందోళనలు జరుపుతున్నారు. చంద్రబాబు, పట్టాభి అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. విజయవాడ సితార సెంటర్‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కడప అంబేద్కర్‌ కూడలిలో వైయ‌స్ఆర్‌సీపీ ఆందోళన జరిపింది. పులివెందులలో  వైయ‌స్ఆర్‌సీపీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. చంద్రబాబు, పట్టాభి దిష్టిబొమ్మలను వైయ‌స్ఆర్‌సీపీ దహ‌నం చేసింది. గుంటూరు, ప్రకాశం జిల్లాలో  వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.