మహిళా రిజర్వేషన్ బిల్లుకు మా మద్దతు
20 Sep, 2023 10:58 IST
తాడేపల్లి: కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైయస్ఆర్ సీపీ మద్దతును ప్రకటించారు. మద్దతు తెలుపుతున్నందుకు తనకెంతో గర్వంగా ఉందంటూ సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. ``మహిళలకు సాధికారత కల్పించడం చాలా ముఖ్యం. ఆంధ్రప్రదేశ్‌లో గత 4 సంవత్సరాలలో ప్రవేశపెట్టిన పథకాలు, వివిధ కార్యక్రమాల ద్వారా మాత్రమే కాకుండా, సమాన ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడం ద్వారా కూడా మహిళా సాధికారతను సాధించాం. కలిసికట్టుగా.. ప్రకాశవంతమైన, మరింత సమానమైన భవిష్యత్తును సృష్టిద్దాం!`` అని సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.