మహానేతకు వైయస్ జగన్ ఘననివాళి
8 Jul, 2024 09:07 IST
వైయస్ఆర్ జిల్లా: ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్ వద్ద దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. మహానేత డాక్టర్ వైయస్ఆర్ 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్ వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తన తండ్రికి ఘన నివాళులర్పించారు. వైయస్ జగన్‌తో పాటు వైయస్ విజయమ్మ, వైయస్ భారతి, పలువురు కుటుంబ సభ్యులు కూడా పాల్గొని మహానేతకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని వైయస్ఆర్‌కు జయంతి నివాళులర్పించారు.