మీ అంకితభావం, సుదీర్ఘ అనుభవం దేశానికి మార్గనిర్దేశం
10 Sep, 2025 10:46 IST
తాడేపల్లి: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రడ్డి అభినందనలు తెలియజేశారు. ‘ రాధాకృష్ణన్ జీ.. మీరు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనందుకు నా అభినందనలు. దేశానికి మీరు చేసే సేవలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మీ అంకితభావం, సుదీర్ఘ అనుభవం మన దేశానికి ఖచ్చితంగా మార్గనిర్దేశంగా పని చేస్తాయి అని వైయస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ వేదికగా వైయస్ జగన్ ట్వీట్ చేశారు.