మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడకు వైయ‌స్‌ జగన్‌ శుభాకాంక్షలు 

18 May, 2025 19:01 IST

తాడేపల్లి : భారత్ మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడకు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు (మే18 వ తేదీ) హెచ్‌డీ దేవెగౌడ 92వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వైయ‌స్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని వైయ‌స్ జగన్ ఆకాంక్షించారు. దేవెగౌడ నాయకత్వం భవిష్యత్తు తరాలకు, దేశ సేవకు స్పూర్తిదాయకంగా నిలవాలని వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.