డీఎస్ మృతికి వైయస్ జగన్ సంతాపం
29 Jun, 2024 12:45 IST
తాడేపల్లి: మాజీ మంత్రి, తెలంగాణకు చెందిన సీనియర్ నాయకుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మరణం పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తన తండ్రి దివంగత మహానేత వైయస్ రాజశేఖర రెడ్డితో డి.శ్రీనివాస్‌కు ఉన్న అనుబంధం మరిచిపోలేనిదని గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని, డీఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. డి.శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.