హంద్రీనీవా ప్రాజెక్టు వైయస్ఆర్ పుణ్యమే
అనంతపురం: హంద్రీనీవా ప్రాజెక్టు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి వైయస్ఆర్ పుణ్యమేనని వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. హంద్రీనీవా - గాలేరు నగరి ప్రాజెక్టుల అనుసంధానం రద్దు చేయడం దుర్మార్గమన్నారు. బుధవారం విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..వైయస్ జగన్ పాలనలో హంద్రీనీవా కాలువల వెడల్పునకు శ్రీకారం చుట్టారని తెలిపారు. 6300 క్యూసెక్కుల స్థాయికి హంద్రీనీవా కాలువల వెడల్పు కు చర్యలు తీసుకున్నారని చెప్పారు. చంద్రబాబు సర్కార్ హంద్రీనీవా కాలువల వెడల్పు ను 3850 క్యూసెక్కులకే పరిమితం చేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. చంద్రబాబు చర్యల వల్ల ఆశించిన స్థాయిలో రాయలసీమకు నీటిని తీసుకురాలేమన్నారు. వైయస్ఆర్ కృషి వల్లే కరవు సీమకు కృష్ణా జలాలు వస్తున్నాయని, వైయస్ జగన్ పై కోపంతో సీమ ప్రాజెక్టులను ఆపడం దారుణమని తప్పుపట్టారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో భారీ దోపిడీ జరుగుతోందని విశ్వేశ్వరరెడ్డి ఫైర్ అయ్యారు.