టిడిపి, బిజేపి, జనసేన కూటమి మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదు
తాడేపల్లి: టిడిపి, బిజేపి, జనసేన కూటమి మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదని వైయస్ఆర్‌సీపీ ఎన్ ఆర్ ఐ కో-ఆర్డినేటర్ యార్లగడ్డ వెంకటరమణ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014లో ఇచ్చిన మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి తీసేసిన ఘనత టిడిపిది. అప్పుడు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రైతుల రుణమాఫి,డ్వాక్రా రుణమాఫి,ఆడపిల్ల పుడితే 25 వేలు అకౌంట్ లో వేస్తాం అన్నారు,నిరుద్యోగ భృతి అన్నారు వీటిలో ఒకటి అమలు చేయలేదు. అందుకే ఇప్పుడు చంద్రబాబు మాటలను ప్రజలు విశ్వసించడం లేదని చెప్పారు.
2019 వైయస్ఆర్ సీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 99 శాతం అమలు చేసిన నాయకుడు సీఎం వైయస్ జగన్ అని యర్లగడ్డ అన్నారు. వాలంటీర్ల వ్యవస్ధ ద్వారా ఇంటింటికి సంక్షేమ పధకాలను వైయస్ జగన్ గారు అందించారు. ప్రతి ఇంటికి వెళ్లి పథకాలు అమలు చేయడం అమెరికాలో చూసా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నామన్నారు.
14 సిఎం గా చంద్రబాబు గొప్పగా చెప్పుకునే ఒక్కపని అయినా ఉందా అని ప్రశ్నించారు. వైయస్ జగన్ సీఎం అయ్యాక కోవిడ్ లాంటి పరిస్థితిలో కూడా పథకాలు అమలు చేస్తే చంద్రబాబు పవన్ హైద్రాబాద్ లో దాకున్నారు. వైయస్ జగన్ గారు అప్పులు చేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.నిజానికి చంద్రబాబు తన పాలనలో ఏం సంపద సృష్టించారో చెప్పాలని నిలదీశారు.
సీఎం వైయస్ జగన్ గారు ప్రభుత్వస్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం చాలా గొప్ప విషయం.
- ఒక nri గా హ్యాపీగా ఉంది..ఇంగ్లీష్ లేనిదే ఇంటర్ నేషనల్ జాబ్స్ చేయడం చాలా కష్టం. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే రాణించడం కష్టం..ఇంగ్లీష్ మీడియం తీసుకురావడంతో పేద విద్యార్దులు సైతం ప్రపంచస్దాయి విద్యార్దులుగా రూపొందుతున్నారు. ఏపిలో ప్రతి ఊరులో సచివాలయం,రైతు భరోసా కేంద్రాలు,ఆరోగ్య వసతి,విద్యా వ్యవస్థ ఇదే సంపద అంటే.కేవలం తారు,సిమెంట్లు రోడ్డు వేయడం అభివృద్ధి కాదు. శాచ్యురేషన్ బేసిస్ పై కులం,మతం,ప్రాంతాలు పట్టించుకోకుండా పథకాలు అమలు చేసిన నాయకుడు వైయస్ జగన్.
విశ్వసనీయత ఉన్న వైయస్ జగన్ ను ప్రజలు మళ్ళీ గెలిపించుకోవాలని యార్లగడ్డ వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. టీడీపీ ఎన్ఆర్ఐ నాయకుడు కోమటి జయరాం ఓటర్లు వెధవలంటూ మాట్లాడిన మాటల పై ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఓటర్లను డబ్బుతో కొనాలి అనడం ఒక న్ఆర్ఐగా సిగ్గుచేటు. ప్రజల మనసు గెలిస్తే అధికారం ఇస్తారు కానీ డబ్బులకు లొంగరు అనేది అందరూ గుర్తించుకోవాలి. పేదలకి,పెత్తందారులకి మధ్య వార్ నడుస్తుంది ప్రజలు పేదల పక్షాన ఉన్న ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని యర్లగడ్డ వెంకటరమణ అన్నారు