ఆక్రమణల గురించి నువ్వు రాస్తే ఎలా గురువింద డ్రామోజీ?
29 Oct, 2022 16:03 IST
తాడేపల్లి: ఈనాడు పత్రిక అధినేత రామోజీరావుకు ట్విట్టర్ వేదికగా వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చురకలంటించారు. ఆక్రమణల గురించి నువ్వు రాస్తే ఎలా గురువింద డ్రామోజీ? అంటూ ఆయన ట్వీట్ చేశారు. అతిపెద్ద ఆక్రమణదారులు "ఈనాడు" రాము, చంద్రం, బంధువర్గమే. జగన్ గారి ప్రభుత్వం విశాఖలో 2,640 కోట్ల విలువైన 480 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. మరో 200 ఎకరాలు తెలుగు దొంగల పార్టీ నేత చంద్రం, బినామీల గుప్పెట్లో ఉన్నాయి.. తప్పించుకోలేరు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.