చౌకబారు డ్రామాలు మీ పేటెంటు చంద్రబాబూ!
23 Jul, 2022 12:56 IST
తాడేపల్లి: వరద ప్రాంతాల పర్యటన పేరుతో చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారాలను వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. చౌకబారు డ్రామాలు మీ పేటెంటు చంద్రబాబూ...మీతో అగ్రనటులు కూడా పోటీ పడలేరు. వరద నీటిని బాటిల్లో నింపి జనం వాటినే తాగుతున్నారని మీరు నమ్మించాలని చూస్తే వరద బాధితులే నవ్వుకుంటున్నారు. మీరు జన్మలో మారరు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.