మల్లేష్‌ను పరామర్శించిన ఎంపీలు
15 Jul, 2020 12:22 IST
విశాఖ: పరవాడ ఫార్మా సిటీ కోస్టల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కెమిస్ట్ మల్లేష్‌ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణలు పరామర్శించారు. పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మల్లేష్‌ను పరామర్శించి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.