స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలి
25 Feb, 2021 18:24 IST
ఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలన్న భారత ప్రభుత్వ నిర్ణయాన్ని పునరాలోచించాలని బొగ్గు, ఉక్కు శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ రాకేష్ సింగ్‌ను వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కోరారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఎంపీల మద్దతు కూడగట్టుకొని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయాలన్న నిర్ణయాన్ని పునరాలోచించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాశారని చెప్పారు. దీనిపై రాకేష్ సింగ్ స్పందిస్తూ.. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. వినతిపత్రం అందజేసిన వారిలో వైయస్‌ఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, అనకాపల్లి లోక్‌సభ సభ్యులు సత్యవతి ఉన్నారు.