వరద బాధితులకు వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విరాళం 

6 Sep, 2024 22:58 IST

తాడేపల్లి:  విజయవాడ వరద బాధితుల కోసం వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ మరిన్ని అడుగులు ముందుకేసింది. వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు, లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నారు. పార్టీ చేపట్టనున్న వరద బాధిత సహాయ కార్యక్రమాలకు ఈ విరాళాన్ని వినియోగించనున్నారు. పార్టీ తరఫున ఇదివరకే కోటి రూపాయల సహాయాన్ని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. దాన్ని వినియోగించి వరద బాధితుల కోసం పాల ప్యాకెట్లు, వాటర్‌ బాటిళ్లు పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. ఇంకా బాధితుల అవసరాలు గుర్తించి, సరుకులు పంపిణీ చేస్తామని పార్టీ ప్రకటించింది. ఆ సహాయ కార్యక్రమాలకు తోడు, ఇప్పుడు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రటించిన విరాళం అదనం కానుంది.