ప్రధానిని కలిసిన వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు
న్యూఢిల్లీ: దేశ ప్రధాన మంత్రిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బుధవారం పార్లమెంట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని ఎంపీలు కోరారు. దిశ బిల్లు అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ.. హోంశాఖ, న్యాయశాఖలకు దిశ బిల్లు వివరాలు ఇప్పటికే అందజేశాం. మహిళలు, శిశువులకు రక్షణ కల్పించేలా దిశ బిల్లు రూపొందించాం. మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి 21 రోజుల్లోనే శిక్షపడేలా బిల్లు ఉంది. మహిళా సంక్షేమానికి సీఎం వైయస్ జగన్ ఎంతగానో కృషిచేస్తున్నాకని ప్రధానికి ఎంపీలు వివరించారు. ప్రధానిని కలిసిన వారిలో వైయస్ఆర్‌సీపీ పార్లమెంట్ చీఫ్ విప్ మార్గాని భరత్, మహిళా ఎంపీలు జీ.మాధవి, వంగా గీతా ,చింతా అనురాధ, వెంకట సత్యవతి ఉన్నారు.