ద్రౌపది ముర్ము నామినేషన్ కార్యక్రమానికి వైయస్ఆర్‌సీపీ ఎంపీలు హాజరు
24 Jun, 2022 16:06 IST
న్యూఢిల్లీ: ఎన్డీఏ కూటమి తరఫున ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేబినెట్ మంత్రులు సహా మద్దతు పార్టీల ప్రతినిధుల సమక్షంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు నామినేషన్ పత్రాలను ఆమె అందజేశారు. ద్రౌపది ముర్ము నామినేషన్‌ను ప్రధాని మోదీ ప్రతిపాదించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మద్దతు పార్టీల నేతల సంతకాలతో నాలుగు సెట్ల నామపత్రాలను ఆమె దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి వైయస్ఆర్‌సీపీ నుంచి విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత మిథున్ రెడ్డి హాజరయ్యారు.