వైయస్‌ఆర్‌సీపీ ఎంపీపీ కళావతికి బెదిరింపులు
18 Mar, 2019 15:19 IST
వైయస్‌ఆర్ జిల్లా: ఎమ్మెల్సీ శివనాథరెడ్డి అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ముద్దనూరు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీపీ కళావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జమ్మలమడుగు అభ్యర్థి డా.సుధీర్‌రెడ్డిని ఇంటికి ఆహ్వానించనున్న నేపథ్యంలో..సుధీర్‌రెడ్డిని ఇంటికి పిలిస్తే చంపుతామని రాత్రి 2 గంటల సమయంలో కళావతి ఇంటికొచ్చిన ఎమ్మెల్సీ శివనాథరెడ్డి అనుచరులు బెదిరింపులకు దిగారు.