ఆ రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్.. ఇప్పుడు మరో చెత్త సినిమా
13 Sep, 2019 11:01 IST
అమరావతి: గతంలో తీయించుకున్న 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'మహానాయకుడు' చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. ఎలక్షన్లలో ఘోర పరాజయం తర్వాత... ఇప్పుడు మళ్లీ 'ఛలో ఆత్మకూరు' అనే చెత్త సినిమాను వదిలారంటూ ఆయన ఎద్దేవా చేశారు. సంక్షేమ కార్యక్రమాలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ దూసుకుపోతుంటే... ఏడుపుగొండి చర్యలతో చంద్రబాబు మరింత పతనమవుతున్నారని విమర్శించారు.