బాసు 18 కేసుల్లో స్టేతో పత్తిగింజని అంటున్నాడు 

9 Sep, 2019 10:44 IST

 అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలపై వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. బాసు ఏమో 18 కేసుల్లో స్టేలు తెచ్చుకుని తాను పత్తిగింజనని చెప్పుకుంటాడని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆయన బానిసలు ఏమో పోలీసులకు కూడా దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. 
పేదలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తే ఇలాంటి వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడుపుటలా ఇసుక బొక్కినవాళ్లకు రేషన్ బియ్యం నాణ్యత ఏం తెలుస్తుందని చురకలు అంటించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.