తమ్ముళ్లను ఎలా ఓదార్చాలో బాబుకు తెలియడం లేదట
15 May, 2019 11:06 IST
అమరావతి: సొంత పార్టీ నేతలే ఎక్కడెక్కడ వెన్నుపోటు పొడిచారంటూ ఎన్నికల సమీక్షల్లో తమ్ముళ్లు బావురుమంటుంటే వారిని ఎలా ఓదార్చాలో తెలియక చంద్రబాబు బిక్కచచ్చిపోతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన ట్విట్టర్లో స్పందించారు. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నూరిపోయడం సంగతి సరే..సమీక్షలు ఇలాగే కొనసాగిస్తే కౌంటింగ్‌కు ముందే కొంప కొల్లేరని గ్రహించే రద్దు చేశారట అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.