ప్రస్తుతం టీడీపీ వెంటిలేటర్‌పై ఉంది
22 Oct, 2021 12:32 IST
విశాఖ: 2019 నుంచి ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైందని, ప్రస్తుతం టీడీపీ వెంటిలేటర్‌పై ఉందని వైయస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు చేస్తే సహేతుకంగా ఉండాలని ఆయన సూచించారు. ఎక్కడా కూడా అసభ్యంగా ఉండకూడదన్నారు. గతంలో చంద్రబాబు పాలన ఎలా ఉండేదో ప్రజలకు తెలుసు అన్నారు. సీఎం వైయస్ జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. సంక్షేమ పాలనను ఓర్వలేక చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ ట్విట్టర్లో అసభ్యకర భాష వాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షం ప్రజా సమస్యలపై పోరాడాలి కానీ అసభ్యకరంగా దూషించడం సరికాదన్నారు.