యజమాని, ఆర్టిస్ట్ ఒకే స్క్రిప్ట్ చదువుతున్నారు

3 Sep, 2019 11:49 IST

అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా సెట్లైర్లు వేశారు. అమరావతి విషయంలో ఇటీవల పవన్ చేసిన విమర్శలకు ఘాటుగా స్పందించారు. యజమాని చంద్రబాబు, ఆయన ప్యాకేజీ ఆర్టిస్ట్(పవన్ కల్యాణ్) ప్రస్తుతం కలిసి ఒకే స్క్రిప్ట్ చదువుతున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. తాను ఎందుకు ఓడిపోయానో తెలియడం లేదని చంద్రబాబు చెబుతుంటే, కాలం కలిసిరావడం వల్ల, ఈవీఎంల వల్లే వైయస్‌ఆర్‌సీపీ గెలిచిందని ఆయన పార్టనర్ అంటున్నాడని దుయ్యబట్టారు. అలాగైతే 23 సీట్లలో టీడీపీని, జనసేనను ఓ చోట ఎవరు గెలిపించారని ప్రశ్నించారు.