టీడీపీ అధికార దుర్వినియోగంపై సీఈసీకి ఫిర్యాదు

22 Mar, 2019 16:54 IST

ఢిల్లీ: తెలుగుదేశం పార్టీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగంపై చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ సునీల్‌ అరోరాను కలిసి ఫిర్యాదు చేశారు. అదే విధంగా డీజీపీ ఠాకూరును ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వినతిపత్రం అందజేశారు.