టీడీపీ పనైపోయిందని నిర్ధారణకు వచ్చారా?
19 Nov, 2023 19:48 IST
తాడేపల్లి: ‘‘చంద్రబాబుకు అనారోగ్యం, బెయిల్ షరతులు సరే.. పార్టీలో లోకేష్, భువనేశ్వరి గారు అందరూ ఏమయ్యారు?. టీడీపీ పనైపోయిందని నిర్ధారణకు వచ్చారా?’’ అంటూ వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి చురకలు అంటించారు.
తెలంగాణ తరహాలోనే టీడీపీ జెండా ఆంధ్రాలో కూడా పీకేశారా? లేక టీడీపీ భారమంతా పురంధేశ్వరిపైనే పెట్టారా?. ఆమె సొంత పార్టీ బీజేపీని ముంచడంలో దిట్ట కావచ్చేమో కానీ.. బావ గారి పార్టీ టీడీపీని బతికించడంలో కాదు సుమా!’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.