`వేణుంబాక విజయసాయిరెడ్డి అను నేను`
18 Jul, 2022 11:30 IST
న్యూఢిల్లీ: `వేణుంబాక విజయసాయిరెడ్డి అను నేను` అంటూ రాజ్యసభ సభ్యులుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. వరుసగా రెండోసారి రాజ్యసభకు ఎన్నికైన విజయసాయిరెడ్డి.. రాజ్యసభ సభ్యులుగా నేడు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఎంపీ విజయసాయిరెడ్డితో ప్రమాణం చేయించారు.