బాబు దృష్టిలో అమరావతి ఎంతో "విలువైనది``
6 Aug, 2020 10:39 IST
తాడేపల్లి: మాజీ సీఎం చంద్రబాబునాయుడి దృష్టిలో అమరావతి ఎంతో 'విలువైనది' అంటూ, అక్కడ బినామీల పేరిట కొన్న భూములు లక్ష కోట్ల విలువైనవని, ఆ లక్ష కోట్లే కావాలని ఆయన అంటున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్ వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "20 మంది ఎమ్మెల్యేలా..? లేక.. బినామీల పేరిట కొన్న భూములకు లక్ష కోట్లా.. అన్న ప్రశ్నకు, ఎమ్మెల్యేలు పోతే పోయారుగానీ.. లక్ష కోట్లే కావాలని బాబు అంటున్నాడు. బాబు దృష్టిలో అమరావతి ఎంతో "విలువైనది" అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.