`బ్రీఫుడు మీ వాయిస్ ప‌సిపిల్ల‌లు కూడా గుర్తుప‌ట్టారు`

18 Aug, 2020 11:07 IST

తాడేప‌ల్లి: ప్రతిపక్షనేత చంద్రబాబుపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు విజయసాయిరెడ్డి విమ‌ర్శ‌ణాస్త్రాలు సంధించారు. `మనవాళ్లు బ్రీఫుడు మీ అన్న వాయిస్ మీదేనని పసిపిల్లలూ గుర్తుపట్టారు. నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఎవరిచ్చారని మీడియా ఇంటర్వ్యూల్లో గద్దించిన సంగతి ఎవరూ మరిచి పోలేదంటూ` ట్విట్టర్‌ వేదికగా ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చుర‌క‌లు అంటించారు. `ఇజ్రాయిల్ ట్యాపింగ్ మిషన్ల కోసం కింద మీదా పడ్డట్టు వికీలీక్స్ బయట పెట్టింది. దొంగే దొంగని అరిచినట్టు లేదూ?` అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.