ఏపీకి ప్రత్యేకహోదా హామీని నిలబెట్టుకోవాలి
24 Jun, 2019 16:28 IST
న్యూఢిల్లీ:ఏపీ తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోందని వైయస్‌ఆర్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి అన్నారు.వడ్డీలకే రూ.20వేల కోట్లు కట్టాల్సి వస్తుందన్నారు.జీతాలు చెల్లించేందుకు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి ఉందన్నారు.ఏపీకి ప్రత్యేకహోదాపై యూపీఏ,ఎన్టీయే హామీలిచ్చాయన్నారు.ఏపీకి ఇచ్చిన ప్రత్యేకహోదా హామీని నిలబెట్టు కోవాలన్నారు.ఏపీలో 77 శాతం రైతులు అప్పుల్లో మునిగిపోయారన్నారు.రైతులను ఆదుకునేందుకు కేంద్రం ఏం చేస్తుందో చెప్పాలన్నారు.స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు చేయాలన్నారు.