బాపట్ల వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా నందిగం సురేష్ నామినేషన్
23 Mar, 2019 14:25 IST
గుంటూరు:బాపట్ల వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా నందిగం సురేష్ నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.రాష్ట్రానికి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పాలన అవసరముందన్నారు.25 సంవత్సరాల పాటు వైయస్‌ఆర్‌సీపీ పాలన ఉంటుందని,అలాంటి గొప్ప పాలన వైయస్ జగన్ అందిస్తారని తెలిపారు.ఒక రైతు కూలి కుటుంబంలో పుట్టి,సామాన్య దళితుడినైనా నాకు ఎంపీ సీటు ఇవ్వడంలోనే వైయస్ జగన్ గొప్పతనానికి నిదర్శనమని తెలిపారు.ఎన్ని జన్మలెత్తిన వైయస్ జగన్‌మోహన్ రెడ్డి రుణం తీర్చుకోలేమని భావోద్వేగం చెందారు.వైయస్ జగన్ మాట తప్పని,మడమ తిప్పని నాయకుడినని రాష్ట్రప్రజలందరికి అర్ధమయిందన్నారు.