విజయనగరం రాజుల ఆస్తులు మొత్తం ప్ర‌జ‌ల‌వే

29 Jun, 2021 14:37 IST

విజయనగరం:  విజయనగరం రాజులు సంపాదించిన ఆస్తులు మొత్తం.. ఆ కాలంలో ప్రజలు కట్టిన కప్పం నుంచి సంపాదించినవేనని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ విమ‌ర్శించారు. టీడీపీ నేత అశోక గజపతిరాజు ఒక్క ఆలయాన్ని అభివృద్ధి చేశారా? అని ఎంపీ  ప్రశ్నించారు.  మంగ‌ళ‌వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గజపతుల భూములు ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌లో పోకుండా.. కాపాడుకోడానికే మాన్సాస్ ట్రస్ట్‌ ఉందన్నారు. 14 వేల ఎకరాల భూములు మాన్సాస్ ట్రస్ట్‌కు ఉన్నాయన్నారు. 8,200 ఎకరాలే అని టీడీపీ ప్రభుత్వ హయాంలో చెప్పారన్నారు. టీడీపీ హయాంలో విజయనగరం మెడికల్ కాలేజీకి.. వంద ఎకరాలు ఇస్తామని అశోక్ చెప్పి 100 కోట్లకు అమ్ముకున్నారని బెల్లాన ఆరోపించారు.