ఏపీ హైకోర్టులో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పిల్
2 May, 2025 21:50 IST
తాడేపల్లి: రాష్ట్రంలోని కన్సాలిడేటెడ్ ఫండ్‌ను యాక్సెస్ చేసే హక్కును ప్రైవేట్ పార్టీకి అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన సవాలు చేస్తూ వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పిల్ దాఖలు చేశారు. ఆర్‌బీఐని ఆశ్రయించి, రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్‌ను యాక్సెస్ చేసేందుకు ప్రైవేట్ పార్టీని అనుమతించాలన్న రాష్ట్ర ప్రభుత్వ చర్య సరికాదన్న పిటిషన్ల పేర్కొన్న అప్పిరెడ్డి .ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగం లోని 203, 204 మరియు 293 అధికరణలను ఉల్లంఘిస్తుందన్నారు. ఈ చర్య చట్టవిరుద్ధమని ప్రకటిస్తూ, తదుపరి చర్యలన్ని నిలుపువేస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్న అప్పిరెడ్డి. వచ్చే వారం విచారణ జరిగే అవకాశం ఉంది.