బీసీలకు తెలుగు దేశం పార్టీ అన్యాయం
తాడేపల్లి: తెలుగు దేశం పార్టీ బీసీలకు అన్యాయం చేసిందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం విమర్శించారు. బీసీ సంక్షేమ సంఘం నేత కేసన శంకరరావు ఒక పార్టీకి వత్తాసు పలకటం సరైనవిధానం కాదన్నారు. బీసీ సంక్షేమ సంఘంలో ఎవరి అనుమతి తీసుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే శంకర్రావు బీసీ సంక్షేమ సంఘాన్ని వదిలి వెళ్లిపోవాలి. అలా కాకుండా బీసీ సంఘాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు.
వైయస్ జగన్ వచ్చిన తర్వాతనే బీసీలకు ఎన్నో పదవులు వచ్చాయి.బిసిలను బ్యాక్ వర్డ్ క్యాస్ లు కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్ లుగా చూసిన ఘనత వైయస్ జగన్ గారిది. రిజర్వేషన్ లకు మించి బీసీలకు ప్రాదాన్యత ఇచ్చి జగన్ గారు అత్యధిక పదవులు ఇచ్చారు. చంద్రబాబు బీసీలకు ఏం చేశారో శంకర్రావు చెప్పాలి. శంకర్రావు బీసీ నాయకుడిగా పనికిరారు. 2019 ముందు బీసీల్లో చాలా కులాలకు అసలు గుర్తింపు లేదు. అలాంటిది జగన్ అన్ని బీసి కులాలకూ న్యాయం చేశారు. 56 బిసి కార్పోరేషన్లను ఏర్పాటుచేశారు.
ఎమ్మెల్సీలు, ఉపముఖ్యమంత్రి పదవితోపాటు మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, డైరక్టర్లు. బీసీల సమస్యలపై అధ్యయనం చేసి వారి ఉన్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు. డిబిటి కింద లబ్దిపొందిన వారిలో మెజారిటీ కుటుంబాలు బిసిలవే. వడ్డెర అయిన తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా వడ్డెర్ల గుండెల్లో వైయస్ జగన్ చిరస్దాయిగా నిలిచిపోయారని ఏసురత్నం వ్యాఖ్యానించారు.