గవర్నర్ ప్రసంగం వైయస్ జగన్ విధానాలకు ప్రతిరూపం
14 Jun, 2019 11:53 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ విధానాలకు గవర్నర్ ప్రసంగం అద్దం పట్టిందని ఎమ్మెల్యే వరప్రసాద్ అన్నారు. ఆయన ప్రసంగంలో ప్రభుత్వ ఉద్దేశాలు ప్రస్ఫుటమయ్యాయి. అణగారిన వర్గాలను చదువుతో అభివృద్ధి పథం వైపు నడిపించేందుకు చర్యలు చేపట్టనున్నారు. పోలవరంను కేంద్రం చేపట్టాల్సి ఉండగా గత ప్రభుత్వం తామే చేపడతానని తప్పుడు నిర్ణయాలు చేసింది. దేశంలో సామాజిక న్యాయం చేయడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోంది. మద్యపానంపై మా ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభిస్తోంది.