చంద్రబాబూ...ఒళ్లు కొవ్వెక్కి వైయస్ జగన్‌ను చంపుతానంటున్నావా?
29 Apr, 2024 15:13 IST
తాడేపల్లి: చంద్రబాబూ...ఒళ్లు కొవ్వెక్కి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని చంపుతానంటున్నావా? అంటూ వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. నువ్వు చంపాలనుకుంటున్నది ఒక ప్రజా నాయకుడిని, ప్రజల గుండె చప్పుడిని. వైయస్ జగన్ గారిని చంపడం అంటే రాష్ట్రంలో ఆరు కోట్ల మందిని చంపడమే అన్నారు. సోమవారం టీజేఆర్ సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడిన అంశాలు:
చంద్రబాబూ..ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడుతున్నావా?:
- – రాజకీయాల్లో కుసంస్కారి, అబద్ధాల పుట్ట అయిన చంద్రబాబు...ఎన్నికల సమయంలో తన అసలు రూపాన్ని చూపుతున్నాడు.
- – ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి తానొక్కడే అర్హుడే అనే పిచ్చి బ్రమలో పైశాచికత్వంతో గతితప్పి మతి చెడి మాట్లాడుతున్నాడు.
- – ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారిని చంపుతాను అంటూ మాట్లాడటాన్ని వైఎస్సార్సీపీ పూర్తిగా ఖండిస్తోంది.
- – ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని మేం డిమాండ్ చేస్తున్నాం.
- – చంద్రబాబు మానసిక పరిస్థితి బాగాలేదని అనేక సార్లు చెప్పాం. ఆయన మాటలు తూలడం, జగన్ గారిని వ్యక్తిగతంగా దూషించడం, నిందలు వేయడం, చాలా చులకనగా మాట్లాడటం ఆయనకి ఆనవాయితీగా మారిపోయింది.
- – రాష్ట్ర ప్రజలందరినీ చంద్రబాబు నిజస్వరూపాన్ని గమనించమని వేడుకుంటున్నాం.
- – ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు విజయవంతమైన పరిపాలన అందించిన వ్యక్తిని పట్టుకుని చంపుతానని ఓ ప్రతిపక్ష నాయకుడు అంటున్నాడంటే ఏ కోణంలో మనం చూడాలి.
- – ఈ రాష్ట్రంలో జరిగిన అనేక హత్యా రాజకీయాలు, దాడులు, కేసులు, విభజనలు, ఘోరాలు, నేరాలు టీడీపీ చేసిందని మేం చెప్తూనే ఉన్నాం.
- – ఆనాడు మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేం ఇవన్నీ చెబితే మేమేదో రాజకీయంగా మాట్లాడాం అన్నారు.
- – ఇప్పుడు స్వయాన చంద్రబాబే నిన్ను చంపితే దిక్కెవరు అంటున్నాడంటే ఆయన ఆలోచన ఏంటి?
- – ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడుతున్నాడా? మతి చెడి మాట్లాడుతున్నాడా?
- – రేపు జూన్ 4వ తేదీన మూటగట్టుకునే ఓటమి గుర్తొచ్చి మాట్లాడుతున్నాడా?
- – చంద్రబాబునాయుడు మానసిక పరిస్థితిని అర్ధం చేసుకోమని ప్రజలు గమనించాలి.
- ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని కన్నూమిన్నూ కానకుండా మాట్లాడతావా..ఖబడ్దార్..!:
- – అంతేకాదు..దద్దమ్మ అన్నాడు..సైకో అంటున్నాడు..శనీశ్వరుడు, డ్రామా కంపెనీల బాస్, అహంభావి..ఇలా అనేకం అంటున్నాడు.
- – ఏం కన్నూమిన్నూ కానడం లేదా చంద్రబాబూ..? ఒళ్లు కొవ్వొక్కి తిక్కతిక్క మాటలు మాట్లాడుతున్నావా?
- – ప్రజలు నీకు చెంపలు పగిలేలా 2019లో తీర్పునిస్తే..నీ దుకాణాన్ని సర్దేసి తెలంగాణాకు వెళ్లి దాక్కున్న నరరూపరాక్షసుడివి నువ్వు.
- – ఏం..తిట్లు మేం తిట్టలేమనుకుంటున్నావా? మాకు బూతులు రావనుకుంటున్నావా?
- – మేము ఏదన్నా ఒక్క మాట అంటే ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ ఏడుస్తున్నావ్..
- – నువ్వు ఇసుక, మట్టితో పాటు పంచభూతాలను దోచుకున్న దొంగల ముఠాకు బాస్‌వి నువ్వు.
- – ఈ రాష్ట్రంలో జరిగిన నేరాలు, ఘోరాలకు వెనుకున్న హస్తం నీదే.
- – రాజధాని నిర్మాణం పేరుతో రైతుల భూములను దోచుకున్న గజదొంగవు నువ్వు.
- – రాజధాని కోసం కేంద్రం ఇచ్చిన రూ.5వేల కోట్లను ఒక్క శాశ్విత కట్టడం కట్టకుండా దోచుకున్న దొంగల ముఠా బాస్‌వి నువ్వు.
- – ఈ దేశంలో వైట్ కాలర్ క్రిమినల్, రాజకీయాలను అడ్డుపెట్టి డబ్బు సంపాదించే రాజకీయ నాయకుడివి నువ్వే చంద్రబాబూ.
- – ఆంధ్రప్రదేశ్ పరువును పదే పదే దిగజార్చిన వాడు ఎవడైనా ఉన్నాడంటే అది నువ్వే.
- – నీ జీవితమంతా డ్రామాలు, దోచుకోవడం, వెన్నుపోటు పొడవటం.
- – నీ జీవితమంతా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం, జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్న గజదొంగలు మీరు.
- – ఇంకా సిగ్గు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని పదే పదే అవహేళన చేస్తున్నావా?
ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి నీకొక్కడికే హక్కుందా?:
- – ఏమయ్యా..ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి నీకొక్కడికే పేటెంట్ హక్కు ఉందా?
- – నువ్వే పరిపాలన చేయాలని రాజ్యాంగంలో రాసిపెట్టి ఉందా?
- – నువ్వు తప్పించి తెలివి కలిగిన వారు ఎవరూ లేరకుంటున్నావా? ఏముంది నీ దగ్గర తెలివితేటలు?
- – ఏం సాధించావు ఈ రాష్ట్రానికి నువ్వు? విభజనకు కారకుడివి నువ్వు కాదా?
- – విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీతో జతకట్టిన రాజకీయ బ్రోకర్‌వి, రాజకీయ వ్యభిచారివి నువ్వు.
- – కేవలం డబ్బులు సంపాదించడం కోసం, ఆస్తులను కూడగట్టుకోవడం కోసం, నీ అనుయాయుల సంస్థలకు దోచిపెట్టడం కోసం రాజ్యాంగపరమైన సీఎం పదవిలో ఉండి ప్రజల ధన, మానప్రాణాలు దోచుకున్న దొంగవు నువ్వు.
- – స్కిల్ స్కాం, ఫైబర్ నెట్ స్కాం లాంటి అనేక మైన స్కాంలు చేసే బాబులకు బాబువు నువ్వు.
- – ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి నీ అంత నీచ చరిత్రలేదు.
- – నీ పార్టీ కాని పార్టీని తీసుకుని అందలమెక్కి నందమూరి వంశానికి అసలు స్థానమే లేకుండా చేసిన నీచాతి నీచమైన చరిత్ర నీది.
- – తండ్రి చనిపోయినా ఒంటరిగా నిలబడ్డాడు. కాంగ్రెస్‌పార్టీ కేసులు పెడితే ఏ మాత్రం బాధ పడకుండా ప్రజలతోనే ఉన్నాడు జగన్.
- – ప్రజలతోనే ఉన్నాడు..పాదయాత్ర చేశాడు..ప్రజలను, రాష్ట్ర స్థితిగతులను అర్ధం చేసుకున్నారు.
- – ఈ రోజు తిరుగులేని మహానాయకుడిగా ఎదిగారు. ఈ రాష్ట్రంలో మా నాయకుడికి ఒక చరిత్ర ఉంది.
- – మా నాయకుడు ఎవరి పార్టీనీ లాక్కోలేదు. ఎవర్నీ వెన్నుపోటు పొడవలేదు.
- – ఒక్కడే పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా అయ్యాడు..రేపు కూడా నీకు దిమ్మతిరిగే రిజల్ట్ ఇస్తాడు.
- – నువ్వు ఎవర్నైనా తెచ్చుకో. సినిమా యాక్టర్లను తెచ్చుకుంటావో, ఢిల్లీ వాళ్లను తెచ్చుకుంటావో..లేదంటే పక్క పార్టీ వాళ్లను తెచ్చుకో.
- – మాకేం అభ్యంతరం లేదు..ఇసుమంత కూడా భయం లేదు. ఎందుకంటే ప్రజలు నిన్ను తుక్కు తుక్కుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు.
- 33 మంది వృద్ధుల మరణాలు చంద్రబాబు చేసిన హత్యలే:
- – దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకురాని ఓ పరిపాలన సంస్కరణ తీసుకొచ్చారు..అదే వాలంటీర్ వ్యవస్థ.
- – ఆ వ్యవస్థ కోసం చాలా మంది యువతీ, యువకులు వాళ్ల జీవితాలను సమాజం కోసం త్యాగం చేశారు.
- – వాళ్లను నువ్వు మూటలు మోసే వాళ్లు, వెదవలు అని తిట్టావ్.
- – బ్రోకర్లు, అసాంఘిక కార్యక్రమాలు చేసే వాళ్లని తిట్టావ్.
- – నువ్వు తిట్టిన తిట్లు ఇప్పటికీ వారి మనసుల్లో ఉండి పోయాయి.
- – వాలంటీర్ వ్యవస్థపై కోర్టు కు వెళ్లింది ఎవరు? నిమ్మగడ్డ రమేష్ ఎవరు? అతన్ని కోర్టుకు పంపించిందెవరు?
- – వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల కార్యక్రమాల్లో ఉండకూడదని తెరవెనుక రాజకీయం చేసింది చంద్రబాబే.
- – ఈ సమాజంలో మంచంలో ఇబ్బంది పడుతున్న వృద్ధులకు శతృవులు మీరు.
- – చనిపోయిన 33 మంది వృద్ధుల మరణాలు మీరు చేసిన హత్యలే.
- – పుష్కరాల్లో ఏ విధంగానైతే నీ షూటింగుల కోసం ప్రజల్ని చంపావో..ఈ 33 మంది వృద్ధులను కూడా నీ రాజకీయం కోసం చంపేశావు.
- – ఈ శాపాన్ని నువ్వు తప్పకుండా అనుభవిస్తావ్..చంద్రబాబూ.
- – మొన్న ఒకటో తేదీన పింఛన్ కోసం ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్క వృద్ధులూ దేవుడ్ని అడిగి ఉంటారు..ఈ నీచుడ్ని అర్జంటుగా తీసుకెళ్లమని.
- – వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదని, అల్లరి చిల్లరి వాళ్లను తీసుకొచ్చి వాలంటీర్లుగా పెట్టామని ఎన్ని విమర్శలు చేశావు?
- – ఇప్పుడేమో సిగ్గు లేకుండా నేను అధికారంలోకి వస్తే రూ.10వేలు ఇస్తానని మాట్లాడతావా?
- – నువ్విచ్చిన సూపర్ సిక్స్‌తో పాటు, వాలంటీర్ల జీతం పెంచుతాను అని అంటున్న నువ్వు జగన్ గారి వ్యవస్థ, పథకాలు బాగున్నాయని ఒప్పుకుంటున్నావు.
- – జగన్‌మోహన్‌రెడ్డి గారి పాలసీలన్నీ కరెక్ట్ అని, జగన్ గారు పరిపాలన దక్షుడని, జగన్ గారు తెచ్చి సంస్కరణలు ఈ రాష్ట్రానికి అవసరమని నువ్వే చెప్తున్నావు.
- – అంతేకాదు జగన్ తెచ్చిన నవరత్నాల్లోని పథకాలను కాపీ కొట్టావు.
- – మేం తెచ్చిన అమ్మ ఒడి, చేయూత, రైతు భరోసాను పెంచుతానంటున్నావు.
- – ఉచిత బస్సు సౌకర్యం కాంగ్రెస్ వద్ద కాపీ కొట్టాడు.
- – నువ్వు కొత్తగా ఏమైనా చెప్పావా? కొత్తగా ఏదైనా పథకాన్ని ఆలోచించావా?
- – అసలు మీకు ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు ఏముంది?
- – విడిపోయిన రాష్ట్రాన్ని నీ చేతుల్లో పెడితే భూమలు దోచుకున్నావ్..నీకొడుకును మంత్రిని చేసుకున్నావ్..
- – వృద్ధులకు ఉన్న జబ్బులు వైఎస్సార్సీపీ వాళ్లకు ఎలా తెలుసు అని అడుగుతున్నాడు.
- – అసలు నీకు బుర్ర ఉందా చంద్రబాబు? ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి జబ్బుల సమాచారం ప్రభుత్వం వద్ద ఉందయ్యా?
- – అలాంటి వారికి డోర్ డెలివరీ చేయమంటే దాన్ని ఆపిన దొంగలు మీరు?
- – సమాజాన్ని కుల, మత, ప్రాంతాలుగా విభజించి పరిపాలించాలనే కుయుక్తి రాజకీయ వేత్తల సమూహమే టీడీపీ. ఆ ముఠాకు నాయకుడు చంద్రబాబు.
- ఎన్టీఆర్ చనిపోయే వరకూ వెంటాడి వేటాడిన నీది అహంకారం చంద్రబాబు..!:
- – జగన్ గారిని అహంకారి అంటావా? ఎక్కడ అహంకారంగా ప్రవర్తించాడో చెప్పు?
- – అహంకారమంటే చంద్రబాబుది. ఎన్టీఆర్‌ను చనిపోయే వరకూ వెంటాడి వేటాడిన నీది అహంకారం.
- – ఆయన భార్యను నేడు ఒంటరిగా చేసిన అహంకారం చంద్రబాబుది.
- – ఇంత నీచ స్వభావం ఉన్న చంద్రబాబు తీరును రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకోవాల్సింది కోరుతున్నాను.
- – చంద్రబాబు మానసిక పరిస్థితి, వారి పార్టీ రాజకీయ వైఖరి, పోటీలో ఉన్న వారి చరిత్రలు మీరు గమనించండి.
- – చంద్రబాబు పరిపాలన విధానానికి, జగన్ గారి పరిపాలన విధానానికి ఒక్క సారి పోలిక చేసుకోండి.
- – చంద్రబాబు దిగిపోయే నాటికి వెయ్యి రూపాయలు పింఛన్ ఇస్తే జగన్ గారు దాన్ని 3వేలు చేశారు.
- – ఇప్పుడు దాన్ని రూ.3,500 చేశాడు. ఒక ప్రజానాయకుడిగా, దక్షతతో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నందుకు మేం జగన్ గారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
- – చేయలేని పనులను చెప్పి..ప్రజలను మోసం చేయకుండా శభాష్ అనిపించుకుంటున్నారు.
- – నిజంగా అలాంటి నాయకుడి వద్ద మేం కార్యకర్తలు పనిచేస్తున్నందుకు మాకు గర్వంగా ఉంది.
- కేవలం 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చి..దానిలో 99 శాతం అమలు చేసిన మొనగాడు వైఎస్ జగన్:
- – ఈ దేశంలో కట్టలకొద్దీ మేనిఫెస్టో ఇచ్చిన వారిని చాలా మందిని చూశాం.
- – దేశ చరిత్రలో కేవలం రెండు పేజీల్లో మేనిఫెస్టో ఇచ్చి, దాన్ని 99 శాతం అమలు చేసిన మగాడు, మొనగాడు జగన్‌మోహన్‌రెడ్డి గారు.
- – జగన్ గారి మేనిఫెస్టోలో ఎంత లోతైన భావం ఉందో..ఆయన పరిపాలనలో అంతే లోతైన సమాజ బాధ్యత ఉంది.
- – జగన్ గారు ఒక చరిత్రకారుడు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి సాధించలేని విజయాలను ఒక్క ఐదేళ్లలోనే సాధించారు.
- – ప్రతి గ్రామంలో జగన్ గారి పరిపాలన ఉంది. ప్రతి ఇంట్లో జగన్ గారి పథకం ఉంది.
- – ప్రతి గుండెలో జగన్ గారు సుస్థిరమైన ప్రజాభిమానాన్ని సాధించుకున్నాడు.
- – చంద్రబాబు ఎంతమందినైనా తెచ్చుకోనివ్వండి..ఇటు మాత్రం ఒక్కడే ఉంటాడు.
- – ఆ ఒక్కడూ ఈ దేశంలో ఒక చరిత్ర కలిగిన వాడు. తన తండ్రి పాలన ధర్మాన్ని భుజానికెత్తుకుని ఒక్కడే మోస్తున్నవాడు.
- – ఆయనకు మీరు అసలు పోటీనే కాదు.
- – మా మేనిఫెస్టోను ప్రజలు కూడా గమనించాలి. నవరత్నాలు అలానే ఉంచి వాటిని పెంచుకుంటూ పోయారు.
- – పింఛన్‌ను 3వేల నుంచి 3,500 చేస్తానన్నారు. రైతు భరోసాను 80వేలకు పెంచుతున్నారు.
- – అమ్మ ఒడి 17వేలకు పెంచారు. చేయూతను 1.50లక్షలకు పెంచారు.
- – డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల వరకూ రుణాలిస్తామని హామీ ఇచ్చారు.
- – ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు ఈ రాష్ట్ర ఖజానా అంతటిని పప్పు బెల్లాల్లా పంచుతున్నాడు అన్న మీ మాటలను మేం ఎలా మర్చిపోతాం?
- – ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, మత్స్యకార భరోసా పెరిగింది.
- – ఇవన్నీ గమనించి ఒక నిజాయితీ కలిగిన, నిఖార్సైన నాయకుడిని మళ్లీ దీవించమని వేడుకుంటున్నా.
- – రాష్ట్ర పజలారా మీరు గమనించండి..జగన్ గారు ఒక్కరే తిరుగుతున్నారు.
- – జగన్ గారికి ఈ రాష్ట్ర ప్రజలంటే ప్రాణం. ప్రజల కోసం ఏమైనా చేయగల తెగువ కలిగిన వాడు.
- – ప్రజలపై తన గుండెల్లో ఉన్న లోతైన ప్రేమను చూపిస్తున్న నాయకుడు జగన్ గారు.
- – జగన్ గారిని రాజకీయంగా అడ్డుకోలేక చంపుతామని చంద్రబాబు బెదిరిస్తున్నాడు.
- – చంద్రబాబు చంపాలనుకుంటుంది ఒక ప్రజా నాయకుడిని, ప్రజల గుండె చప్పుడిని.
- – జగన్ గారిని చంపడం అంటే రాష్ట్రంలో ఆరు కోట్ల మందిని చంపడమే చంద్రబాబూ!
- – ఈ దేశంలో కరుడుగట్టిన తీవ్రవాదివి నువ్వు. రాజకీయ ముసుగులో ఉన్న గజదొంగ చంద్రబాబు.
- – ఇకనైనా చంద్రబాబు తన వ్యాఖ్యలను మార్చుకోవాలి.
- – ఎన్నికల కమిషన్ చంద్రబాబుపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కోరుతున్నాం.