గ్రాఫిక్స్ చూపించి బాబు మోసం చేశారు
తాడేపల్లి: రాజధానిపై ఎల్లో మీడియా అసత్య ప్రచారాలు చేస్తోందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు రాజధానుల ప్రతిపాదనను పార్టీలకు అతీతంగా ప్రజలంతా స్వాగతిస్తున్నారని చెప్పారు. అమరావతిలో రాజధాని పేరుతో చంద్రబాబు మోసం చేశారని, టీడీపీ నేతలు అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారన్నారు. రాజధాని పేరుతో గ్రాఫిక్స్ చూపించి బాబు రియలెస్టేట్ వ్యాపారం చేశారన్నారు. రాజధాని రైతులు ప్రభుత్వంతో జరపాలని కోరారు. రాజధాని రైతులకు అన్యాయం జరగనివ్వమని ప్రభుత్వం స్పష్టంగా చెబుతుందని, బినామీలు కొనుగోలు చేసిన భూములు కాపాడుకోవడం కోసం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు ఆందోళనలు చేయిస్తున్నారన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం స్వాగతిస్తున్నారని చెప్పారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషిచేస్తున్నారన్నారు.