వైయస్ జగన్‌తోనే నా ప్రయాణం..
అసెంబ్లీ: తాను ముఖ్యమంత్రి వైయస్ జగన్ వెంటే ఉంటానని, ఆయనతోనే తన రాజకీయ ప్రయాణం సాగిస్తానని మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైయస్ఆర్ కుటుంబానికి గానీ, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు వ్యతిరేకంగా తాను ఒక్క చిన్నమాట కూడా మాట్లాడలేదని, మాట్లాడనని చెప్పారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి వల్లే రాజకీయాల్లోకి వచ్చానని గుర్తుచేశారు. కొన్ని కారణాల వల్లనే మడకశిర నియోజకవర్గానికి కొత్త ఇన్‌చార్జ్ నియామకం జరిగిందన్నారు. టికెట్ కోసం ప్రయత్నిస్తూనే ఉంటానని, బీ ఫారం వచ్చేంతవరకూ తాను ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటానని మాత్రమే అన్నానని చెప్పారు. 40 ఏళ్లపాటు వైయస్‌ఆర్ కుటుంబాన్ని అంటి పెట్టుకుని ఉన్నానని, ఆ కుటుంబంతో తనకు అనుబంధం ఉందని, అందుకే టికెట్ కోసం ప్రయత్నిస్తూనే ఉంటానని ఎమ్మెల్యే తిప్పేస్వామి అన్నారు.