చంద్రబాబును తరిమికొట్టేందుకు ప్రజలు కంకణం
చిత్తూరు:రాష్ట్ర ప్రజలు వైయస్ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ నగరి అభ్యర్థి ఆర్కే రోజా అన్నారు.చంద్రబాబు అబద్ధాలు చెప్పి అందలం ఎక్కారని, ప్రజా సంక్షేమం పట్టించుకోకుండా నెట్టేట ముంచారన్నారు.చంద్రబాబును తరిమికొట్టి..వైయస్ జగన్‌ను సీఎం చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారన్నారు.వైయస్‌ఆర్ హయాంలో గాలేరునగరి ప్రాజెక్టును దాదాపుగా 80 శాతం పూర్తిచేశారని,ఆ తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు.గాలేరునగరి పూర్తయితేనే తాగు,సాగునీరు సమస్యలు తీర్చవచ్చన్నారు. వైయస్ జగన్ కూడా గాలేరునగరి ప్రాజెక్టు పూర్తిచేస్తామని తెలిపారన్నారు.వైయస్‌ఆర్‌సీపీ విజయాన్ని చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసిన ఆపలేరన్నారు.నియోజకవర్గంలో చెరుకు రైతులు అధికంగా ఉన్నారని, 2004లో వైయస్ రాజశేఖర్‌రెడ్డి చెరుకు ఫ్యాక్టరీలను తెరిపించి రైతులను ఆదుకున్నారన్నారు. చెరుకు రైతులకు మేలు చేస్తానని వైయస్ జగన్ చెప్పడంతో రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.