వైయస్ జగన్ సారథ్యంలో సుపరిపాలన
25 May, 2019 11:21 IST
అమరావతి:తిరుగులేని మెజార్టీతో వైయస్ జగన్మోహన్రెడ్డి సీఎం కాబోతున్నారని వైయస్ఆర్సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఆమె తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ వైయస్ జగన్‌పై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టకున్నారని తెలిపారు.సంవత్సర కాలంలో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటున్నానని వైయస్ జగన్ తెలిపారని గుర్తుచేశారు.ఆయన తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ వల్లే సుపరిపాలన అందిస్తారని తెలిపారు.రాష్ట్ర ప్రజల కష్టాలను దూరం చేస్తారని తెలిపారు.2014 ఎన్నికల్లో మోదీ,చంద్రబాబు,పవన్‌కల్యాణ్‌లను కలిసి మోసం చేశారని తెలిపారు.చిన్న వయసు గల జగన్మోహన్రెడ్డి పెద్ద మనస్సుతో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు.నన్ను ఐరన్లెంగ్ అని వైయస్ఆర్సీపీ నుంచి దూరం చేయడానికి టీడీపీ చాలా కుట్రలు పన్నిందని, కాని ప్రజలు నన్ను మళ్లీ గెలిపించారని తెలిపారు.