కూటమి నేతలకు ఓటమే సరైన గుణపాఠం

2 May, 2024 23:23 IST

 తాడేప‌ల్లి: ప్రజలను టెర్రరైజ్ చేస్తున్న కూటమి నేతలకు ఓటమే సరైన గుణపాఠమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు అన్నారు. వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాల‌యంలో మ‌ల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు అన్నీ అవాస్తవాలు మాట్లాడుతున్నారు. బురదచల్లుతున్నారు. సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నారు. ప్రజల ఆస్దుల పత్రాలు జగన్ గారి ఇంట్లో ఉంటాయంటూ పవన్ కల్యాణ్ ఉన్మాదస్దాయిలో మాట్లాడుతున్నారు. అసలు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకువస్తుంది బిజేపినే అనే విషయం మాత్రం మరుగునపరుస్తున్నారు. ఆడబిడ్డలకు భధ్రత,రక్షణ అంటూ పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. జగన్ గారు మహిళల విషయంలో దిశయాప్ తీసుకువచ్చారు.మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. అనేక రకాల కార్యక్రమాలను తీసుకువచ్చారు.

  • మహిళా సాధికారిత తీసుకువచ్చారు.
  • ఆసరా,చేయూత వంటి ప్రోగ్రామ్స్ తీసుకువచ్చారు.
  • 26 వేల కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకు మేలు చేకూర్చారు.
  • అమ్మఒడి మహిళలకు ఎంతగానో ఉపయోగపడింది.
  • మహిళల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు,పవన్ కల్యాణ్ కు ఏమాత్రం లేదు.
  • ఏపిలో 23 లక్షలమంది యువకులు గంజాయితో తప్పుదోవ పట్టారంటూ అసత్యాలను ప్రచారం చేస్తున్నారు.
  • గంజాయిని నిర్మూలించిన ఘనత జగన్ గారి ప్రభుత్వందే.
  • యవత పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారు. విద్యావకాశాలను సైతం నిర్లక్ష్యం చేసింది చంద్రబాబే.
  • ఏపి ఇమేజ్ ను చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు దిగజార్చారు.
  • చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు.వారిని బూతులు తిడుతున్నారు.
  • తనను సమర్దించాలని ప్రజలను బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు.
  • విజయవాడ,గుంటూరు నగరపాలకసంస్దలలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ శక్తివంతంగా ఉంది.