బాధిత కుటుంబానికి అండగా నిలిచాం
అమరావతి: గతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం పట్టించుకునేదికాదన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో రైతులు అప్పులపాలు అయ్యారని, అప్పుల బాధలు తాళలేక మా నియోజకవర్గంలో రైతు ఆత్మహత్య చేసుకంటే ప్రభుత్వం అండగా నిలిచిందని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. బుధవారం ఆయన అసెంబ్లీలో బడ్జెట్‌పై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో రూపొందించిన బడ్జెట్‌లో ప్రజా సంక్షేమం, అభివృద్ధికార్యక్రమాలు ఉన్నాయని చెప్పారు. పారదర్శకతతో బడ్జెట్ రూపొందించారని చెప్పారు. రైల్వే కోడురు నియోజకవర్గంలో అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకుంటే..వెంటనే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించి, వైయస్‌ఆర్ జిల్లా కలెక్టర్‌ను అప్రమత్తం చేసి చనిపోయిన రైతు కుటుంబానికి రూ.7.50 లక్షల పరిహారం అందించి తోడుగా నిలిచిందన్నారు. బడ్జెట్‌లో రైతులకు పెద్ద పీట వేశారని వివరించారు. బడ్జెట్‌లో దళితుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.