ఓర్వలేక ప్రభుత్వంపై విషప్రచారం
విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. తప్పుడు రాతలు రాస్తున్న వ్యక్తులు ఎలాంటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడుతూ... రివర్స్‌టెండరింగ్ ద్వారా ప్రభుత్వం నిజాయితీ ప్రదర్శించిందన్నారు. ఈ ప్రాజెక్టు రివర్స్‌టెండరింగ్ ద్వారా మేఘా ఇంజనీరింగ్ సంస్థ రూ. 4359 కోట్లకు పనులు దక్కించుకోవడం ద్వారా ప్రభుత్వానికి వందల కోట్ల డబ్బు ఆదా అయ్యిందన్నారు. 2020 కల్లా పోలవరం పనులు పూర్తి కానున్నట్లు తెలిపారు. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టును రూపొందించిన అనుభవం మేఘా సంస్థకు ఉండడం కలిసొచ్చిన అంశమన్నారు. పోలవరం పూర్తయితే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.